సహారా సంఘం మండల కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

24-11-2026 | 09:21pm

బెజ్జంకి, నవంబర్ 24 (విజయక్రాంతి): సహారా ఖాతాదారుల(Sahara account holders) మరియు కార్యకర్తల సంక్షేమ సంఘం(Workers' Welfare Association) ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల నూతన కమిటీలను సోమవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల బాలయ్య, ముఖ్య సలహాదారు వేల్పుల బాలరాజు, అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతుల శంకర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.

నూతన అధ్యక్షుడిగా చేరాల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా రాజు బాబు, కోశాధికారిగా పరకాల అంజయ్య గౌడ్, మహిళా అధ్యక్షురాలిగా నంది రేణుకతో పాటు పలువురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వడ్ల బాలయ్య నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. సహారా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. ఖాతాదారులు తమ డబ్బులు తిరిగి పొందేందుకు ఐక్యంగా న్యాయపోరాటం చేయాలని మహిళా అధ్యక్షురాలు రేణుక పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు