'ఇందిరమ్మ బీమా'లో చేరాలి
ఎల్బీనగర్, నవంబర్ 24 : ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ(Congress Party government) లక్ష్యమని, ప్రతి కుటుంబం ఇందిరమ్మ బీమా పథకంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్ సూచించారు. డాక్టర్స్ కాలనీ డివిజన్లో మంగళవారం ఇందిరమ్మ బీమా పథకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ, పథకం అమలు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ధన్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్రాన్ ఖాన్, కలుముల సంతోష్ కుమార్, ఆసిఫ్, సలీం, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.