అయ్యప్ప మహా పడిపూజలో డిప్యూటీ మేయర్

24-11-2026 | 09:23pm

ముకరంపుర, నవంబర్ 24(విజయ క్రాంతి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని భగత్ నగర్‌లో గల శ్రీ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో(Ayyappa Swamy Temple) నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు యాదగిరి సునీల్ రావును శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన అర్చకులు మంగళంపళ్లి రాజేశ్వర శర్మ, డింగిరి చాణక్య, గురుస్వాములు డి.సంపత్,  ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, బిజెపి నాయకులు, అయ్యప్ప మాలాధారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు