ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన

24-11-2026 | 09:06pm
  1. బీఆర్ఎస్ దొచుకంంటే... కాంగ్రెస్ మాటల గారడీ 
  2. సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు 

ఎల్బీనగర్, నవంబర్ 24 : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన(Congress Rule) కొనసాగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) దొచుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీ పాలన చేస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. మంగళవారం ఆయన మన్సూరాబాద్ లోని తన నివాసంలో మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలతో పబ్బం గడుపుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారాల కోసం పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయాలని సూచించారు. మతతత్వ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, సర్ పేరుతో ముస్లిం ఓట్లను, బీజేపీ వ్యతిరేకుల ఓట్లను తొలగిస్తున్నట్లు ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఏ రంగంలోనూ ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఎల్ నినో ప్రభావంతో రైతాంగం అల్లాడిపోతున్నదని, రైతులను ఆదుకోవాలని కోరారు.   355 కరువు మండలాలుగా ప్రకటించి ఇప్పటికీ వారికి ఆర్థిక సహాయం అందించకపోవడం, నష్టపరిహారం ఇవ్వకపోవడం, తగిన నిధులు విడుదల చేయకపోవడం ప్రభుత్వ విఫల పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రయత్నం చేయడం లేదని, వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులను కేంద్రం నుంచి  రాబట్టుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రంతో కొట్లాడాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు