కర్మన్ఘాట్ హనుమాన్ ను దర్శించుకున్న గవర్నర్
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
ఎల్బీనగర్, నవంబర్ 24 : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్(Telangana Governor) శివప్రతాప్ శుక్లా సతీమణి జానకీ శుక్లాతో కలిసి హైదరాబాద్లోని చారిత్రక కర్మన్ఘాట్ శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్కు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు, ఈవో లావణ్య, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ స్వామివారిని దర్శించుకుని, శివుడు, హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి వెల్లివిరియాలని ప్రార్థించారు.