6 September, 2026 | 3:42 PM

ఘనంగా పోచమ్మ బోనాలు

06-09-2026 | 02:37pm

శ్రావణ మాసం లో భక్తిశ్రద్ధలతో వేడుకలు

చేర్యాల, సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): పట్టణంలో పోచమ్మ బోనాల(Pochamma Bonalu) వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో పట్టణ కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన ఎత్తుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోచమ్మ తల్లి(Pochamma talli)కి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో  ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, పట్టణ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు