బంగారు గూడ మైనారిటీ గురుకులంలో వనమహోత్సవం
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad) పట్టణ సమీపంలోని బంగారు గూడ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమన్నారు. ప్రతి విద్యార్థి తమ ఇల్లు, పాఠశాల ఆవరణలో కనీసం ఒక్క మొక్కనైనా నాటి, అది మహావృక్షంగా ఎదిగే వరకు క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు(Digital board)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కలీమ్, వైస్ చైర్మన్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ జగదీష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






