ఈ వారం వార్తల్లో..
సీఈవోకు 550 కోట్లు
టెక్ దిగ్గజం యాపిల్ సీఈవోగా జాన్ టెర్నస్ పగ్గాలు చేపట్టారు. ఆయన వార్షిక వేతనం రూ. 551 కోట్లు. మే 1975లో యూఎస్‌లోని కాలిఫోర్నియాలో(California, USA) ఆయన జన్మించాడు. 1997లో పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ బృందంలో చేరి, 2026 వరకు కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు.
అమెరికా అందగత్తె
భారత సంతతికి చెందిన కిరణ్‌రెడ్డి అనే 18 ఏళ్ల యువతి అమెరికాలో జాతీయ స్థాయి అందాల పోటీల్లో ’మిస్ టీన్ యూఎస్‌ఏ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. 50 రాష్ట్రాల నుంచి వచ్చిన అందాల భామలను వెనక్కి నెట్టి జాతీయ స్థాయి టైటిల్ కైవసం చేసుకున్న భారత సంతతి యువతిగా ఆమె రికార్డు సృష్టించారు. కిరణ్‌రెడ్డిది జార్జియా రాష్ట్రం డగ్లస్‌లోని కాఫీ కౌంటీ. ఇటీవలే విద్యాభ్యాసం పూర్తి చేసింది.






