6 September, 2026 | 4:37 PM

హామీల అమలు కోరుతూ బీఆర్‌ఎస్‌ ‘బాకీ కార్డుల’ పంపిణీ

06-09-2026 | 02:57pm

రాయికోడ్, సెప్టెంబర్ 06 ( విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయికోడ్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌(BRS) నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలిసి బాకీ కార్డుల(Outstanding cards)ను అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకే ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చేవెళ్ల విట్టల్, సర్పంచ్ రాధా తుకారం, ప్రధాన కార్యదర్శి శంకర్, సంగమేశ్వర్, రాజు, రాములు తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు