6 September, 2026 | 4:36 PM

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

06-09-2026 | 02:55pm

హైదరాబాద్: ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్(Folk dancer Madhuri Rathod) ఆత్మహత్యాయత్నం చేసింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుంటుండగా తలుపులు పగలగొట్టి మాధురి రాథోడ్ ను కుటుంబసభ్యులు కాపాడారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈశ్వర్ సాయి(Eswar Sai) మోసం చేశాడని మాధురి(Madhuri Rathod) ఆరోపించింది. ఈశ్వర్ సాయిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ మాధురి ప్రాణాలు తీసుకుని ప్రయత్నం చేసింది.

ఈశ్వర సాయి మీద ఫిర్యాదు చేసిన అరెస్టు చేయలేదని మాధురి వాపోయింది. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  డ్యాన్సర్ మాధురి ఈశ్వర్ సాయితో రూమ్ లో ఉండగా ఈశ్వర్ సాయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం జరిగిన వాదనలో మాధురి రాథోడ్ పై ఈశ్వర్ సాయి భార్య చేయిచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ గా మారింది.

మరిన్ని వార్తలు