6 September, 2026 | 4:36 PM

లయన్స్ ఇంటర్నేషనల్ వేదికగా మంథనికి అరుదైన గౌరవం

06-09-2026 | 03:04pm

మంథని, సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): సామాజిక సేవలో తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న మంథని లయన్స్ క్లబ్ విజన్ కేర్‌(Manthani Lions Club Vision Care)కు అరుదైన గౌరవం దక్కింది. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్(Lions International District) 320జీ ఆధ్వర్యంలో ఆదివారం రామగుండంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో అట్టహాసంగా నిర్వహించిన వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో లయన్స్ క్లబ్ విజన్ కేర్ అధ్యక్షుడు లయన్ బుద్దార్తి సతీష్ కుమార్ కు ప్రతిష్టాత్మక ఉత్తమ ప్రెసిడెంట్ అవార్డు లభించింది.

సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పేదలు, నిరుపేదలకు విశేష సేవలు అందించడంతో పాటు క్లబ్ అభివృద్ధికి సతీష్ కుమార్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ పూదరి దత్తాగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ నాయకత్వంలో క్లబ్ అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ అవార్డు వ్యక్తిగతంగా సతీష్ కుమార్‌కు మాత్రమే కాకుండా, లయన్స్ క్లబ్ విజన్ కేర్‌కు దక్కిన గౌరవమని తెలిపారు. ఈ పురస్కారం క్లబ్ సభ్యులపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొంటూ సతీష్ కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని సతీష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు