తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని మల్లన్నకు ముడుపు
ఎన్హెచ్ఎం ఉద్యోగులు కొమురెల్లి మల్లన్నను వేడుకోలు
కొమరవెల్లి,(విజయక్రాంతి): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ 19 రోజుల నుండి కలెక్టరేట్ కార్యాలముందు నిరువధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషిన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా కొమురవెల్లి మల్లన్న స్వామని దర్శించుకున్నారు.
అనంతరం తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసేలా చూడాలని మల్లన్న స్వామిని కోరుకున్నారు. అదేవిధంగా గంగ రేగు చెట్టుకు ముడుపులు కట్టారు. అనంతరం సంఘం జిల్లా బాధ్యులు సాయిబాబా మాట్లాడుతూ తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరువదిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు.
ఇతర రాష్ట్రాలలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేసినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ చేయకపోవడం శోచనీయమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, వినయ్, వీరేశం, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.