ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

31-10-2026 | 07:36pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఏఐటియుసి 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల(AITUC 107th Foundation Day Celebrates)ను కార్మికులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయం వద్ద కామ్రేడ్ సువర్ణ ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర హాజరయ్యారు. మండల సిపిఐ కార్యదర్శి ఎల్. ఈశ్వర్ మండల సిపిఐ సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ రామచంద్ర పాల్గొన్నారు.

రాష్ట్ర నాయకులు జయచంద్ర మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక వర్గం ఏకతాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు ఉద్యమించాలని జయచంద్ర పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు బాలనరసింహ,  శ్రీరాములు భూపాల్ రామ్ కుమార్, అరుణ, రాజు, శోభ, బాలమణి, రమాదేవి, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు