పేద ప్రజల సంక్షేమం కోసం స్వర్గీయ ప్రధాని కృషి

31-10-2026 | 08:08pm

బోథ్,(విజయక్రాంతి): పేద ప్రజల సంక్షేమ కోసం స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ఎంతగానో కృషి చేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. శనివారం మాజీ ప్రధాని వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆమె చేసిన సేవలు గుర్తు చేయడం జరిగింది. భారత రాజకీయ చరిత్రను ఆమెకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పలువురు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి చంటి, జిల్లా జనరల్ సెక్రెటరీ అబ్రార్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ దాస్, మాజీ ఎంపిటిసి షేక్, జనరల్ సెక్రెటరీ అబూద్, అధికార ప్రతినిధి అల్పటి అచ్చుతానంద రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ సలీం, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, వార్డు సభ్యులు షాకీర్, కార్యదర్శి పి నీరజ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు