కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

31-10-2026 | 04:53pm

చెక్కుతో పాటు తులం బంగారం అందించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్,(విజయక్రాంతి): అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ మండలానికి చెందిన 54 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా లబ్ధిదారులకు లక్షా నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు