పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి
ధర్మపురి,(విజయక్రాంతి): ఎండపల్లి మండలం(Endapalli mandal)లోని కొత్తపేట గ్రామంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని(CCI cotton procurement center) తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.