ఇందిరాగాంధీ, సర్దార్ పటేల్లకు ఘన నివాళులు
ధన్వాడలో ఘనంగా వర్ధంతి, జయంతి వేడుకలు
దేశ సమగ్రతకు వారి సేవలు చిరస్మరణీయం
మంథని,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి(Indira Gandhi Death Anniversary), ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC Secretary Srinu Babu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం వారు చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని శ్రీను బాబు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత కోసం వారు చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.