గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

31-10-2026 | 07:48pm

ఐటీడీఏ పీఓ మంద మకరందు

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజనుల సంస్కృతి(Tribal Culture), సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐటీడీఏ పీఓ మంద మకరందు(ITDA PO Manda Makarandu) అన్నారు. శనివారం తిర్యాణి మండలం ఎద్దులపాడు గ్రామంలో గిరిజన నాయకుడు వెడమ రాము 39వ వర్ధంతి(Wedama Ramu death anniversary) కార్యక్రమంలో పాల్గొని స్మారక స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు