రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను వేయాలి

31-10-2026 | 07:46pm

వ్యవసాయ అధికారి ప్రజాపతి

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాజీవాడి గ్రామం(Timmajiwadi village)లో ఖేత్ బచావో అభియాన్ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమంపై మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి(Mandal Agricultural Officer Prajapati) రైతులకు అవగాహన కల్పించారు. ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం(Khet Bachao Abhiyan Program)లో భాగంగా భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ నిర్వహణ, పంట అవశేషాల నిర్వహణ అంశాల పైన రైతులకు అవగాహన కల్పించి, ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుంది.

రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టి నీటి లభ్యతకు అనుగుణంగా ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని ఏవో   సూచించడం జరిగింది. యాసంగిలో వరి విస్తీర్ణం పూర్తిగా తగ్గించి ఆరుతడి పంటలైన మొక్కజొన్న జొన్న, శనిగలు, సజ్జలు, పెసర్లు ,మినుములు వంటి పంటలు సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  , నందిపేట్ భవాని సాయిలు, ఉపసర్పంచ్  జె రవీందర్రావు ,ఏఇవో సురేందర్  మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు