నూతన వధూవరులను ఆశీర్వదించిన మారెడ్డి రవీందర్ రెడ్డి
06-09-2026 | 06:36pm
సిద్దిపేట రూరల్,సెప్టెంబర్6: మాచాపూర్ గ్రామ సర్పంచ్(Village Sarpanch) గుమ్మడి బాలరాజు(Gummadi Balaraju) కుమార్తె కుమారి లికిత–లోక్ సాయి నిశ్చితార్థ వేడుకకు మాజీ సుడా చైర్మన్(SUDA Chairman) మారెడ్డి రవీందర్ రెడ్డి(Mareddy Ravinder Reddy) హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బట్టు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, సర్పంచులు రత్నాకర్ గౌడ్,గోపీనాథ్ రెడ్డి,రాజు,నాగరాజు, నరేందర్ రెడ్డి, శంకర్, మాజీ వైస్ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి,రామరాజు, సతీష్ రెడ్డి,కనకరాజు, లక్కీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






