ఏడు ళ్లబయ్యారంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన
అధికారులకు వినతిపత్రం అందజేత
పినపాక ,సెప్టెంబర్ 6,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసంబి చేస్తోందని బీఆర్‌ఎస్(BRS) శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాలానుసారం, స్థానిక నాయకులు పగడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుళ్లబయ్యారం(Edu Labayaram) గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న తీవ్రమైన పారిశుధ్య సమస్యలపై గులాబీ శ్రేణులు ధ్వజమెత్తాయి. గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి దోమల బెడద విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.






