జడ్చర్ల మినీ ట్యాంక్ బండ్లో వ్యక్తి మృతి
కుటుంబ సభ్యుల అనుమానాలపై పోలీసుల దర్యాప్తు
జడ్చర్ల, అక్టోబర్ 24: జడ్చర్ల పట్టణంలోని(Jadcherla town) పాత బజార్ ప్రాంతానికి చెందిన చేగోల రాములు(Chegola Ramulu) (50) మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో నీటిలో పడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాములు గతంలో కూడా ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లి తిరిగి వచ్చే అలవాటు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 21న ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు.
ఈ నేపథ్యంలో మినీ ట్యాంక్ బండ్(Mini Tank Bund) ప్రాంతంలో రాములు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి(Jadcherla Government Hospital) తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు.
అయితే తన భర్త మృతిపై(Death of husband) అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా విచారణ జరిపించాలని మృతుడి భార్య చేగోల యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.