హెటిరో సహకారంతో అంగన్వాడీ చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ

24-10-2026 | 11:14pm

జిన్నారం, అక్టోబర్ 24 : జిన్నారం మున్సిపాలిటీ(Jinnaram Municipality) పరిధి రాళ్లకత్వ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Centre) చిన్నారులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, షూస్ పంపిణీ(Distribution of school bags, books, and shoes) చేశారు. హెటిరో కంపెనీ(Hetero Company) సహకారంతో కౌన్సిలర్ ఆది గీత రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంగన్వాడీ టీచర్ ఆది పుణ్యవతి చేతుల మీదుగా చిన్నారులకు సామగ్రి అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ గీత మాట్లాడుతూ, చిన్నారుల చదువుకు ప్రోత్సాహం అందించేలా హెటిరో కంపెనీ ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచుతాయని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు