స్కూటీని తప్పించబోయి అదుపుతప్పిన ఆటో
డ్రైవర్ మల్లేష్ కు తీవ్ర గాయాలు
బాలానగర్ : మండల పరిధిలో ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి ఆటో(Auto Accident) అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన నేరళ్లపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మల్లేష్ ఉదయం ఆటోలో బాలానగర్ కు వెళ్తుండగా ఎదురుగా స్కూటీ వచ్చిన స్కూటీని తప్పించేందుకు ఆటోను పక్కకు మళ్లించడంతో అదుపుతప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రాతి కడీల ఫెన్సింగ్‌ను బలంగా ఢీకొని, అక్కడి నుంచి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మల్లేష్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆటో నుంచి బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.