గ్రీన్ గణేశాతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన

12-09-2026 | 08:40am

నర్సాపూర్: వినాయక చవితిని పురస్కరించుకుని విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ‘గ్రీన్ గణేశా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై(environmental protection) అవగాహన కల్పించే ఉద్దేశంతో విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల తయారీపై కార్యక్రమం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. రమేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పర్యావరణహిత మట్టి విగ్రహాల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. రసాయనాలతో తయారయ్యే విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలనే వినియోగించాలని నిర్వాహకులు సూచించారు.కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, కోఆర్డినేటర్లు,విద్యార్థులు,పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు