కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక సాయం

26-09-2026 | 05:05pm

కష్టకాలంలో కార్యకర్తలకు అండగా కాంగ్రెస్‌ పార్టీ: ఎర్రబోలు రాజారెడ్డి

సిద్దిపేట రూరల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బెల్లె రాజమణి తల్లి జక్కపురం లచ్చవ్వ మృతి చెందడంతో రెండో వార్డు నర్సాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రటరీ ఎర్రబోలు రాజారెడ్డి తెలిపారు.

కష్టకాలంలో ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రెండో వార్డు అధ్యక్షుడు నాయిని సాయి మల్లు, ఉపాధ్యక్షుడు బండారి కనకరాజు, సీనియర్ నాయకులు మోత్కూరి బాల్‌నర్స్, బెల్లె మల్లేశం, మోత్కూరి శ్రీనివాస్, కనకయ్య, యాదగిరి, మరుపాక నరసయ్య, నర్సింలు, పెళ్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు