జ్యుడీషియల్ కార్యవర్గం ఏర్పాటు
27-09-2026 | 08:26pm
నిర్మల్, సెప్టెంబర్ 27 ( విజయ క్రాంతి) : జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్(District Judicial Employees Association) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికలు(Elections) నిర్వహించగా అధ్యక్షుడిగా బి. అమర్నాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్. విశాల్ ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అసోసియేషన్ అధ్యక్షుడిగా డి. ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా కే. శ్రీనివాస్ రావు, ఏ. నరేందర్, సిహెచ్. షెఫాలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే. శ్రీధర్ రెడ్డి, కోశాధికారిగా హరీష్, సంయుక్త కార్యదర్శులుగా కె. జయప్రసాద్, సిహెచ్. రవి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర బాధ్యులు భుజంగ్ రావు, చంద్రమోహన్ వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.