ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

27-09-2026 | 08:39pm

హుజురాబాద్, సెప్టెంబర్ 27: (విజయక్రాంతి) : తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) 111వ జయంతి వేడుకలను(Birthday celebrations) పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోనిఆర్టీసీ డిపో క్రాస్‌రోడ్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు(Nizam autocratic rule) వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ, చేనేత మరియు సహకార రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో వేముల యాదగిరి, విడప రాజు, మంద రమేష్, సంగెం ఐలయ్య, చిలుకమారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, కడవెరుగు సత్యం, కుడికాల భాస్కర్, సంగెం భాస్కర్, కొండా గణేష్, మండల యాదగిరి, జర్నలిస్ట్ కుడికాల సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు