83 మందికి రూ. 7.95 లక్షల జరిమానా
- 9 మందికి జైలు శిక్ష
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 83 మంది పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు(Traffic CI Muthyam Raju) తెలిపారు. వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు. న్యాయమూర్తి విచారణ జరిపి ఇద్దరికి రెండు రోజులు, నలుగురికి మూడు రోజులు, మరో ఇద్దరికి అయిదు రోజులు, ఒకరికి 10 రోజులు చొప్పున జైలు శిక్ష విధించారని తెలిపారు. మొత్తం 83 మందికి కలిపి రూ.7లక్షల 95వేల 500 జరిమానా విధించారని పేర్కొన్నారు. డ్రైవింగ్ లేసెన్స్ లేని 18 మందికి రూ. 90వేలు జరిమానా విధించారని సీఐ ముత్యంరాజు తెలిపారు.
ఒకరికి 3 రోజుల జైలు
సిద్దిపేట టూ టౌన్ పరిధిలోని వేములవాడ కమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన ఒకరికి న్యాయమూర్తి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని సీఐ మురళి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.