అన్నారెడ్డిపల్లి నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

27-09-2026 | 11:06pm

మహబూబ్ నగర్ జిల్లా: మహమ్మదాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : మండల పరిధిలోని అన్నారెడ్డిపల్లిలో(Annareddipalli) నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని(Gram Panchayat Building) పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy) శనివారం ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ కాట్రావత్ లక్ష్మీమోహన్, పంచాయతీ కార్యదర్శి బి. జ్ఞానేశ్వర్‌లను వారి కుర్చీల్లో కూర్చోబెట్టి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు.

గ్రామపంచాయతీ పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొర్ర లోక్య, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు