ఎన్ ఎన్ జి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక శోభాయాత్ర

27-09-2026 | 11:03pm
  1. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జిఎంఆర్ 
  2. రూ 26 లక్షల ఒక్క వెయ్యి 116 పలికిన లడ్డు, 

అమీన్ పూర్ /పటాన్ చెరు, సెప్టెంబర్ 27 : అమీన్‌పూర్ మున్సిపల్(Ameenpur Municipality) మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో  వినాయక నిమజ్జన(Vinayaka Immersion) శోభాయాత్ర అత్యంత వైభవంగా ఆదివారం సాయంత్రం  నిర్వహించారు. ఎన్.ఎన్.జి (NNG) యువసేన నిర్వహించిన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navaratri celebrations) ముగింపు వేడుకలు స్థానికులను విశేషంగాఆకట్టుకున్నాయి. సుమారు 200 మందికి పైగా కళాకారులతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఈ నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.

ఈ  వేడుకలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) ముఖ్య అతిథులుగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డు వేలం పాటలో ఉగ్గు సాయి కిరణ్ యాదవ్ 26 లక్షల ఒక్క వెయ్యి 116 రూపాయలకు దక్కించుకున్నారు. వారిని నందారం నరసింహ గౌడ్ ఘనంగా సత్కరించారు.

భక్తులంతా భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అమీన్‌పూర్, బీరంగూడ పరిధిలోని పలు కాలనీల కమిటీల సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు