తల్లిదండ్రులు తమ హృదయాల్లో శాశ్వతంగా నిలుపుకున్నారు

27-09-2026 | 10:43pm

బిడ్డ లేని లోటును తట్టుకోలేక, ఆమె జ్ఞాపకార్థం ఏకంగా గుడినే నిర్మించి నిత్య పూజలు చేస్తున్నారు, 

కొల్లాపూర్ సెప్టెంబర్ 27: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లి మున్సిపాలిటీ(Chukkapalli Municipality) చెందిన కానిస్టేబుల్ రమేష్(Constable Ramesh) దంపతులకు 14 ఏళ్ల క్రితం గీతిక జన్మించింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న గీతిక బ్రెయిన్ డ్యామేజ్(Geethika brain damage) కారణంగా అకాల మరణం చెందింది. కూతురి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లిదండ్రులు,ఆమె జ్ఞాపకాలను దేవతగా భావించి గుడి నిర్మించారు.

ప్రతిరోజూ పూజలు చేస్తూ తమ కూతురిని స్మరించుకుంటున్నారు. కూతురు దూరమైనా, ఆమె జ్ఞాపకాలను దేవతగా కొలుస్తున్న తల్లిదండ్రుల ప్రేమకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది. ఆదివారం అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా గీతిక జ్ఞాపకాలు మరోసారి అందరి హృదయాలను తాకుతున్న అన్నారు.

మరిన్ని వార్తలు