2024 డీఎస్సీ ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు పీఆర్‌టీయూ చొరవ

27-10-2026 | 06:44pm

నాగల్‌గిద్ద, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): 2024 డీఎస్సీ ద్వారా నియమితులై రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న నాగల్‌గిద్ద మండల ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్(Regularization of Teachers' Service) కోసం పీఆర్‌టీయూ టీఎస్ మండల శాఖ చొరవ తీసుకుంది. ఈ మేరకు సంబంధిత పత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో సమర్పించారు.

ఉపాధ్యాయులకు సర్వీస్ ప్రయోజనాలు, వార్షిక ఇంక్రిమెంట్లు సకాలంలో అందేలా సంఘం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మహారెడ్డి విట్టల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, మండల అధ్యక్షుడు శేరికార్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి జీవన్ రావుతో పాటు జిల్లా కార్యాలయ అధికారులు నాగభూషణం, వెల్ఫేర్ రాజు, రాజకుమార్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు