నీటి వనరుల సంరక్షణపై దృష్టి సారించాలి

27-10-2026 | 07:15pm

ట్రైని డిప్యూటీ కలెక్టర్

బోథ్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): భావితరాల కోసం మనమంతా నీటి వనరుల సంరక్షణపై దృష్టి సారించాలని ట్రైని డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ రెడ్డి(Trainee Deputy Collector Vamshikrishna Reddy) పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మారిమూల ఆదివాసి గిరిజన గూడెం అయిన చింతగూడ గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన 30 ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత ఎంపీడీవో రమేష్ ఎంపీ ఓ రాజకుమార్ ఏపీఓ జగ్జీరావు టిఏ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు