భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) రూరల్ మండలం బొమ్మకల్ లో ఈ నెల 25 రాత్రి తన భార్య స్వరూపను గొంతు పిసికి హత్య చేసిన కేసులో నిందితుడైన దావు చంద్రకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు దావు చంద్రకుమార్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పిల్లలు కలగడం లేదనే కారణంతో భార్య స్వరూపకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ స్వరూప ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నెల 25వ తేదీ రాత్రి మద్యం సేవించిన నిందితుడు స్వరూపను తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు రాకపోవడంతో ఆగ్రహంతో అదే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటిలో బెడ్‌పై నిద్రిస్తున్న భార్య స్వరూప వద్దకు వెళ్లి ఆమె గొంతు పిసికి హత్య చేశాడు. మరుసటి రోజు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.