వి బి జి రాంజీ పథకం కింద 38 లక్షల పని దినాలు కల్పిస్తాం
బోథ్. అక్టోబర్ 27 ( విజయక్రాంతి) జిల్లాలో కూలీలు వలస పోకుండా వి బి జి రాంజీ పథకం(VBG Ramji Scheme) కింద పని చేసేందుకు 38 లక్షల పని దినాలను కల్పించడం జరిగిందని అందుకు అవసరమైన 11 కోట్ల 735 వేల రూపాయలు నిధులు ఉన్నాయని జిల్లా పరిషత్ సీఈవో బి రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కూలీలు వలస పోకుండా పని దినాలను కల్పించడంతోపాటు 375 రకాల పనులను చేపట్టేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి గ్రామానికి 40 మంది చొప్పున కూలీలు పనిచేసే విధంగా చూడాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. నీటి వనరుల సంరక్షణ పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అన్నారు.
అయితే రైతులు కూలీలు తమ పొలాలలో ఇండ్ల వద్ద నీటి కుంటల నిర్మాణం చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలను సమయత్వం చేయాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కు సూచించారు. భూగర్భ నీటిమట్టం తిరగడంతో పాటు ప్రజల సామూహిక అవసరాల కోసం ఉపయోగపడే పనులను చేపట్టాలని సూచించారు.
గ్రామపంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అనుమతి ఉన్నాయని వాటి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆయన వెంట ఎంపీ ఈవో రాజ్ కుమార్ ఏపిఓ జగదే రావు లు ఉన్నారు..