పారిశుద్ధ పనుల పర్యవేక్షణ చేసిన ప్రత్యేక అధికారి
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 27 (విజయ క్రాంతి):మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామాన్ని మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్(Special Officer Raj Kumar) సోమవారం సందర్శించారు.ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పనులు పరిశీలన,ఇంకుడు గుంతలు నిర్మాణం కొరకు మార్కౌట్ వేయడం జరిగింది.మరియు పారిశుద్ధ పనుల పర్యవేక్షణ చేశారు.
ఈ సందర్భంగా మండల ప్రతి అధికారి రాజకుమార్ మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వివరాలను అడిగి తెలుసుకున్నారు.అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి ఒక్కరూ చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ చారి,గ్రామ సర్పంచ్ అక్కల వర్షిని పరమేశ్వర్,కార్యదర్శి శంకర్,ఫీల్డ్ అసిస్టెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు.