అమరవీరులకు జోహార్లు
* హుస్నాబాద్ ఏసీపీ సధానందం
* హుస్నాబాద్ లో పోలీస్ సైకిల్ ర్యాలీ
కోహెడ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం హుస్నాబాద్ లో పోలీస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ(Cycle Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సధానందం మాట్లాడుతూ.. 1959లో చైనా భారత దేశ భూభాగాన్ని ఆక్రమించుటకు సైనిక బలగాలను మోహరించిన నేపథ్యంలో తమ దేశ పోలీస్, సైనికులు అడ్డుకొని పలువురు అమరులైయారాని.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తుగా ప్రతి ఏటా 21 అక్టోబర్ నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు పేర్కొన్నారు. సైనిక, పోలీస్ సేవలు చిరస్మరణీయడారు. ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ శ్రీధర్, హుస్నాబాద్, అక్కన్నపేట ఎస్ఐలు లక్ష్మారెడ్డి, ప్రశాంత్ పాల్గొన్నారు.