ఖేడ్ అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల నిధులు మంజూరు

17-10-2026 | 10:15pm

ఎమ్మెల్యే సంజీవరెడ్డి 

నారాయణఖేడ్, అక్టోబర్ 17: నారాయణఖేడ్ నియోజకవర్గ(Narayankhed Constituency) అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(Patlolla Sanjeeva Reddy) తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డిగ్రీ కళాశాల(Degree College) వెనుక రూ.5 కోట్లతో ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం(Indoor and outdoor stadium) నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని,తదుపరి విడతలో మరో రూ.5 కోట్లు కేటాయించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

బోరంచలో ఎకో కాటేజీలకు రూ.2 కోట్లు,బోటింగ్‌కు రూ.2 కోట్లు మంజూరయ్యాయని, కమలాపూర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.బంజారా భవన్‌కు రూ.2 కోట్లు,ఎస్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

ఆర్డీవో,తహసీల్దార్,క్యాంప్ కార్యాలయాల సముదాయానికి రూ.12.5 కోట్లు మంజూరై టెండర్ దశలో ఉందన్నారు. మహిళల ఉపాధి కోసం సెట్విన్ కేంద్రం,నిజాంపేటలో రూ.10 కోట్లతో ఆధునిక పాఠశాల,మనూరు మండలంలో విద్యాసంస్థ ఏర్పాటు,అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ వంటి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు