బస్టాప్ ఏర్పాటు చేయొద్దు

17-10-2026 | 11:10pm

చింతలకుంట గ్రామస్తుల డిమాండ్ 

ఎల్బీనగర్, అక్టోబర్ 17 : ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్టీసీ బస్సుల(RTC buses) కోసం బస్టాప్ ఏర్పాటు చేయొద్దు అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.‌ వనస్థలిపురం డివిజన్(Vanasthalipuram Division) చింతలకుంటలోని ప్రలవి గార్డెన్ సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాప్ ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. బస్టాప్ ఏర్పాటు చేయడంతో పరిసర కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చింతలకుంట గ్రామస్తులు  కూరెళ్ళ వేములయ్య గౌడ్, ప్రలవి గార్డెన్ యజమాని ప్రసాద్ రావు, కాలనీవాసులు బాలరాజ్ గౌడ్, వెంకట్ యాదవ్, గిరీష్  అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీఎస్ఆర్టీసీ కోసం బస్టాప్ ఏర్పాటును అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం నుండే విజయవాడ జాతీయ రహదారికి సంబంధించిన సర్వీస్ రోడ్డు ప్రారంభం కావడం.. సుమారు పది పన్నెండు  పరిసర కాలనీలకు కనెక్టివిటీ రోడ్డు వద్ద బస్ స్టాప్, కార్గో  ఏర్పాటు చేస్తున్నడంతో   స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని తెలిపారు.

అంతేకాకుండా ఆంధ్రకు , దూరపు ప్రాంతాలకు.వెళ్లే బస్సులు చాలాసేపు సర్వీస్ రోడ్డుపైనే ఉండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. వ్యాపారస్తులు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీ కార్గో బస్టాపులను ఏర్పాటు చేయనీయమని హెచ్చరించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న బస్టాప్ ను  ఆటోనగర్ వద్ద అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు