స్మార్ట్ రేషన్ కార్డులు బహుళ ప్రయోజనాలు ఎంపీ,ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి అక్టోబర్17( విజయక్రాంతి ) : స్పాట్ రేషన్ కార్డులతో(Smart Ration Cards) బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Cards) ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి(Rama Sahayam Raghurami Reddy), శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.మండలం పరిధిలోని యాతాలకుంట గ్రామంలో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ కార్డులతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఎంతగానో లబ్ధి జరుగుతుందని, అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయడం జరిగిందని, వీటిని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి ,మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.