ఎంబీబీఎస్ సీటు సాధించిన ఉప్పునుంతల విద్యార్థిని
17-10-2026 | 11:00pm
అచ్చంపేట, అక్టోబర్ 17: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) ఉప్పునుంతలకు చెందిన జంపుల విద్య ఎంబీబీఎస్ సీటు(MBBS seat) సాధించింది. తండ్రి గణేష్ హెయిర్ కటింగ్ షాపు నిర్వహిస్తుండగా, తల్లి చైతన్య కుట్టు మిషన్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పట్టుదలతో చదివిన విద్య, నారాయణ కళాశాలలో(Narayana College) ఇంటర్ పూర్తి చేసి కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల(Kodangal Government Medical College)లో సీటు సాధించింది. భవిష్యత్తులో పేదలకు వైద్య సేవలందించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తూ విద్యను అభినందించారు.