కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’

30-10-2026 | 05:48pm

పటాన్ చెరు: హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో ‘సాధన 2026’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, నాటకం, దృశ్య కళల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు బృందాలుగా వివిధ కళారూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సంగీత ప్రదర్శనలకు చంద్రకాంత్ మృదంగంపై, వాసు శాస్త్రి వయోలిన్‌పై సహకారం అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి మధ్యంతర మూల్యాంకనంలో భాగంగా ఈ కార్యక్రమం ఉపయోగపడింది. విద్యార్థుల ప్రతిభ, అంకితభావాన్ని అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. అనుభవపూర్వక అభ్యసనానికి, వర్ధమాన కళాకారుల ప్రోత్సాహానికి ‘సాధన 2026’ ఒక మంచి వేదికగా నిలిచింది.

మరిన్ని వార్తలు