గణేష్ మండపాల్లో మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పూజలు
రామచంద్రపురం ఆగస్టు 18: రామచంద్రపురం మండలం(Ramachandrapuram Mandal) భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి డివిజన్ పరిధిలోని గణేష్ మండపాలను సందర్శించి, విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓల్డ్ ఎంఐజీ కాలనీలోని లంబోదర యూత్, మన గణేష్ యూత్ అసోసియేషన్, నవభారత్, ఎఫ్ పార్క్, నేతాజీ కమ్యూనిటీ హాల్, వివేకానంద పార్క్ గణేష్ మండపాలతో పాటు బీహెచ్ఈఎల్ టౌన్షిప్లోని గణేష్ మండపాన్ని సందర్శించారు.
అలాగే బాంబే కాలనీలోని వీఆర్ యు(వ)సేన గణేష్ మండపం, రామచంద్రాపురంలోని మల్లికార్జున్ నగర్ గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువతతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహిస్తున్న యువతను సింధు ఆదర్శ్ రెడ్డి అభినందించారు.