దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

18-09-2026 | 09:22pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత (Collector K. Haritha) తెలిపారు. ప్రపంచ చెవిటి దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దివ్యాంగ నిర్ధారణ శిబిరాలను జిల్లా ఆసుపత్రిలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు హక్కులు, చట్టపరమైన ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని న్యాయమూర్తి అనుషా తెలిపారు.

మరిన్ని వార్తలు