నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో అన్నదాన కార్యక్రమం

18-09-2026 | 09:06pm

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్(Nagireddypet Police Station) ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనితో ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ ఎస్‌.ఐ.భార్గవ్ గౌడ్(SI Bhargav Goud) మాట్లాడుతూ... పండుగల సమయంలో డీజేలు, అధిక శబ్దాలతో కూడిన కార్యక్రమాల కంటే భజనలు, సాంప్రదాయ కళా కార్యక్రమాలు ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయని తెలిపారు.

డీజే వల్ల కలిగే ఆనందం కంటే మరింత ఎక్కువగా భజన బృందాలుగా వినాయక నిమజ్జనాన్ని ఊరేగింపును తీసుకెళ్లినట్లయితే ప్రశాంతమైన, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందవచ్చునని ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డీజేలను ఏర్పాటు చేయకుండా భజన బృందాలు, సాంప్రదాయ కళాకారులు, కళా ప్రదర్శనలు నిర్వహించే కళాకారులను ప్రోత్సహించాలని ఎస్సై భార్గవ్ గౌడ్ నాగిరెడ్డిపేట్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తద్వారా యువతలో సాంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు,పండుగల యొక్క అసలైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వాతావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజలందరూ పోలీసు శాఖ సూచనలు,నిబంధనలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్‌.ఐ భార్గవ్ గౌడ్ కోరారు.

మరిన్ని వార్తలు