విచారణకు నేను సిద్ధం
- నాపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారించండి
- బదిలీ చేశానన్న కోపంతోనే మహిళా ప్రొఫెసర్ దుష్ప్రచారం
- డీజీపీ సీవీ ఆనంద్‌కు ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ వీసీ జానయ్య లేఖ
- జానయ్యను సస్పెండ్ చేయాలి బీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల డిమాండ్
- పీజేటీఏయూ ముట్టడికి యత్నం, అరెస్టు
రాజేంద్రనగర్, నవంబర్ 10 (విజయక్రాంతి): తనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా పూర్తిస్థాయి విచారణ జరిపిం చాలని కోరుతూ మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Agricultural University) వైస్ ఛాన్సలర్ (వీసీ) డాక్టర్ జానయ్య.. డీజీపీ సీవీ ఆనంద్‌కు లేఖ రాశారు.
పరిపాలనాపరమైన కారణాలతో బదిలీ చేశానన్న కోపంతోనే ఓ మహిళా ప్రొఫెసర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సమాజంలో తనకున్న పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేందుకే ఈ విధమైన కుట్రకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘గత రెండు సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో నేను అమలు చేసిన ప్రగతిశీల మార్పులను, నూతన వ్యవస్థలను అస్థిరపరిచేందుకు ఇదో పెద్ద కుట్ర. నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఆమె ఈ ప్రయత్నానికి ఒడిగట్టారు. వర్సిటీ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతోనే లైంగిక వేధింపులంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చడంతో పాటు, దీని వెనుకున్న అసలు కుట్ర కోణాన్ని బయటపెట్టాలి’ అని వీసీ జానయ్య డీజీపీని కోరారు. సదరు మహిళా ప్రొఫెసర్‌కు సంబం ధించిన గత మూడు నెలల కాల్ లిస్టుపైనా సమగ్ర విచారణ జరపాలని వీసీ డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడిన ఆడియో, వీడియో కాల్స్ వివరాలను కూడా పూర్తిగా బయటపెడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని లేఖలో స్పష్టం చేశారు.
వర్సిటీ వద్ద బీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల ఆందోళన
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుం ది. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్డాస్ జానయ్యను సస్పెండ్ చేయాలని, బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు,
విద్యార్థి సంఘా లు మంగళవారం భారీ ఆందోళన చేపట్టాయి. వర్సిటీ ముట్టడికి యత్నిం చిన నిరసనకారులను పోలీసులు అడ్డుకో వడంతో రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. బాధితురాలికి మద్దతు గా బీఆర్‌ఎస్ మహిళా శ్రేణులు, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నాయకులు,
విద్యార్థులు వర్సిటీ ప్రధాన గేటు ముందుకు చేరుకుని ధర్నాకు దిగారు. ‘వీసీని వెంటనే తొలగించాలి.. మహిళా ప్రొఫెసర్కు న్యాయం చేయాలి‘ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం వీసీని ఎందుకు కాపాడుతోందని మాజీ మంత్రులు ప్రశ్నించారు. ఒక దశలో నిరసనకారులు వర్సిటీ ప్రాంగణం లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
అనంతరం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు పలు వురు బీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.