భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి..
జవహర్‌నగర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): విప్లవ వీరుడు భగత్‌సింగ్(Bhagat Singh) ఆశయాలకు అనుగుణంగా నేటి యువత సమసమాజ స్థాపన కోసం ముందుకు రావడమే ఆయనకు నిజమైన నివాళి అని జవహర్ నగర్ సీపీఐ నాయకులు(Jawahar Nagar CPI leaders) పిలుపునిచ్చారు. సోమవారం జవహర్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో, సీపీఐ కాప్రా మండల పరిధిలో దర్శనం యాదగిరి అధ్యక్షతన భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహ, రాష్ట్ర సీనియర్ నాయకులు సీహెచ్. దశరథ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.నేటి యువత గంజాయి, దురలవాట్లకు బానిసలు కాకుండా, కులమతాలకు అతీతంగా దేశ సంపద సమసమాజానికి అందేలా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి. వెంకటచారి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, పార్టీ నాయకులు కే. జయమ్మ, డి. మల్లిక, కిరణ్ కుమార్, కే. రాజు, డి. భాస్కర్ రావు, రాజేశ్వరి, ఎండి. కాజా మియా, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.