భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

28-09-2026 | 10:12pm

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని మోర్గి మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో సోమవారం స్వాతంత్ర సమరయోధుడు షహీద్ భగత్‌సింగ్(Bhagat Singh) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగాలు, సాగించిన విప్లవ పోరాటాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం ప్రాముఖ్యతను తెలియజేశారు.

భగత్‌సింగ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన స్ఫూర్తితో ఆత్మస్థైర్యం, ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి.సువర్ణ, సోషల్ ఉపాధ్యాయులు పాపారావు, సీహెచ్.పండరి, సుభాష్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు