రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో భద్రతకు ప్రాధాన్యం

28-09-2026 | 11:12pm

కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలి: సీఎస్ సంజయ్ జాజు

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మౌలిక వసతులు కల్పించాలి

రాజన్న సిరిసిల్ల 28 సెప్టెంబర్ (విజయక్రాంతి): రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(State Government Chief Secretary Sanjay Jaju) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణపై సమీక్షించారు. సిరిసిల్ల నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొన్నారు.

విద్యాసంస్థల్లో ఆహారం నాణ్యత, పారిశుధ్యం, హాజరు, వసతులను నిరంతరం పర్యవేక్షించాలని, కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సీఎస్ సూచించారు. శీతాకాలం నేపథ్యంలో వేడి నీరు, దుప్పట్లు అందుబాటులో ఉంచాలని, అద్దె భవనాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫారాలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ మొండయ్య, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు